రక్త హీనంతో KGH హాస్పిటల్లో వైద్యం పొందుతున్న పాంగి.శివరత్నంనికి మూడు యూనిట్స్ బ్లెడ్ మరియు ఆర్థిక సహాయం అందించిన బీజేపీ నేత జై ఆదివాసీ జై భీమ్ స్వయం సేవ ట్రస్ట్ చైర్మన్ దుక్కేరి.ప్రభాకరరావు వారి బృందం
అల్లూరి సీతారామరాజు జిల్లా G.మాడుగుల మండలం సొలొభం గ్రామానికి చెందిన పాంగి.శివరత్న విశాఖపట్నం KGH హాస్పిటల్లో తన శరీరంలో మూడు గ్రాముల రక్తం ఉంది అని డాక్టర్స్ చెప్పగా KGH హాస్పిటల్లో రక్త నిల్వలు లేదని బీజేపీ నేత జై ఆదివాసీ జై భీమ్ స్వయం సేవ ట్రస్ట్ చైర్మన్ దుక్కేరి.ప్రభాకరరావుకు వారి బంధువులు తెలిపిన వెంటనే స్పందించిన అతను KGH హాస్పిటల్ డాక్టర్స్ తో మరియు రక్త దాతలతో సంప్రదించి మూడు యూనిట్స్ బ్లెడ్ మరియు అనేకమంది దాతలు ద్వారా ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఈ ధనాన్ని నేరుగా పాంగి.శివరత్నం నివాసం పాడేరులో తన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అందించటంతో ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని సహాయం చేసిన దుక్కేరి ప్రభాకరరావు కు ట్రస్ట్ ద్వారా సహాయం చేసిన బృందానికి రక్త దాతలకు మరియు ఆర్థిక దాతలకు శివరత్నం మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.