జనసేన పార్టీ క్రియాశీలక మెంబర్లను ఆపదలో ఆదుకునే పార్టీ జనసేన పార్టీ.
జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుంది. ప్రమాదం జరిగితే ఐదు లక్షల బీమా- మంత్రాలయం జనసేన పార్టీ అధ్యక్షుడు బి లక్ష్మన్న.
మంత్రాలయం నియోజవర్గం మంత్రాలయంలో క్రియాశీలక మెంబర్లకు ఐడి కార్డులు కిట్ల పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ ఇంచార్జ్ బి లక్ష్మన్న, మంగళగిరి ఆఫీసు నుంచి ప్రత్యేక ఆఫీసర్లు సాయి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. మంత్రాలయం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, అధ్యక్షులు బి లక్ష్మన్న మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్రియాశీలక మెంబర్లకు కుటుంబ భరోసా కోసం బీమా పథకాన్ని వర్తింపజేశారు. క్రియాశీలక మెంబర్లకు ఏదైనా ప్రమాదం జరిగితే 50వేల రూపాయల వరకు మెడికల్ ఖర్చులు. ఒకవేళ ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చెక్కు కుటుంబ సభ్యులకు అందజేస్తారని లక్ష్మణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి అత్యధిక సంఖ్యలో క్రియాశీలక మెంబర్లుగా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ జనసేన పార్టీ బలోపేతం అవుతున్నది. రాబోవు కాలంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా జనసేన పార్టీ తన సత్తా చూపిస్తుందని లక్ష్మణ ధీమా వ్యక్తం చేసారు. జనసేన పార్టీ హెడ్ ఆఫీస్ మంగళగిరి ఆఫీస్ నుంచి ప్రత్యేక ఆఫీసర్గా వచ్చిన సాయి గారు జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను, జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో సి వీరా రెడ్డి, బజారి, ఎస్ చిన్న, సుమిత్ర, బీవీ రవిచంద్ర, ఆలీ భాష, ఏసన్న, ప్రభుదాస్, నరసింహులు, చెన్నారెడ్డి, అబ్దుల్, రాంప్రసాద్, తిక్కయ్య, రామాంజనేయులు, గణేష్, మరియునాలుగు మండలాల జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.