నరేంద్ర మోడీ,గారికి హృదయపూర్వక ధన్యవాదాలు



డైనమిక్ లీడర్ షిప్ లో,ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు గాను భారత ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోడీ,గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తు ఎక్స్ డిప్యూటీ మేయర్, చైర్‌పర్సన్, స్టాండింగ్ కమిటీ, గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్, విశాఖపట్నం. డా. దాడి. సత్యనారాయణ గారు కృతజ్ఞతా లేఖను పంపుతూ విశాఖపట్నం కలెక్టర్ కు అందజేశారు.



విశాఖపట్నం.

----------------------------

డా. దాడి. సత్యనారాయణ

ఎక్స్ డిప్యూటీ మేయర్,

చైర్‌పర్సన్, స్టాండింగ్ కమిటీ

గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్, విశాఖపట్నం

తేది: 07-05-2025

నరేంద్ర మోడీ గారికి,

ప్రధానమంత్రి,

న్యూ ఢిల్లీ, ఇండియా.

విషయం: మీ యొక్క, డైనమిక్ లీడర్ షిప్ లో,ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు గాను భారత ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోడీ,గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు.

 రెస్పెక్టెడ్, సర్,

నేను,డా. దాడి. సత్యనారాయణ, విశాఖపట్నం నగరానికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్‌గా, ఈ లేఖను కృతజ్ఞతా పూర్వకంగా  రాస్తున్నాను. 

పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా,మీరు విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

సర్, దేశం మొత్తం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం హిల్ స్టేషన్‌లో జరిగిన అమానవీయ ఉగ్రవాద దాడిలో అమాయక ప్రజల మరణాన్ని సంతాపిస్తున్న సమయంలో, ప్రజలు మీ కఠినమైన మరియు బలమైన ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నారు. మీలాంటి చురుకైన నాయకుడి నుండి ఇది ఆశించినదే. భారత వైమానిక దళాలు (IAF) పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను 07/05/2025 తేదీ తెల్లవారుజామున ధ్వంసం చేసిన వార్త ఇప్పుడు అందరికీ చేరింది.

నేను, 1.4 బిలియన్ భారతీయుల తరఫున మరియు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 5 కోట్ల పౌరుల తరఫున, ఈ ఉగ్రవాదులకు మీరు చూపిన ధైర్యవంతమైన మరియు వేగవంతమైన ప్రతిస్పందనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. 

మేము,మీ యొక్క సమర్థవంతమైన,మీ నాయకత్వంపై ఎంతో గర్వంగా మరియు కృతజ్ఞతతో ఉన్నాము.

ధన్యవాదాలు సర్,

మీ,

డా. దాడి.సత్యనారాయణ

మాజీ డిప్యూటీ మేయర్, GVMC, విశాఖపట్నం

కాఫీ టు :

జిల్లా కలెక్టర్, విశాఖపట్నం.