ప్రభుత్వ వైద్య మెడికల్ కళాశాల అంటే ఒక వ్యాపారమా....

తక్షణమే మెడికల్ కళాశాల పనులు కొనసాగించాలి. 
మెడికల్ కళాశాల పై కూటమి ప్రభుత్వ నిర్లక్షం వీడలి.      
విద్యార్థి సంఘాలు డిమాండ్...



ఆదోని: ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ PDSO డివిజన్ సెక్రటరీ శివ DSF జిల్లా అధ్యక్షుడు దానాపురం ఉదయ్ PSA రాష్ట్ర అధ్యక్షుడు రాజు SSA రాష్ట్ర కార్యదర్శి  శివ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ..... ఆదోని మెడికల్ కళాశాల అర్ధాంతరంగా పనులు నిలిపేసి ఈ కూటమి ప్రభుత్వం 66 సంవత్సరాలకు లీజుకి ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.... పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య ప్రజలకు సరైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతో  గత వైఎస్ఆర్సిపి హాయంలో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలలో  ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల కడుపులు కొడుతూ ప్రైవేట్ పరం చేస్తూ PPP పద్ధతిలో కొనసాగిస్తామని నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది.. ఇప్పటికైనా ప్రజలను విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధీనంలోనే వైద్య మెడికల్ కళాశాలను కొనసాగించాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము..