డేరాలలో శెట్టి నాగేశ్వరరావు విస్తృత ప్రచారం
ఎయిర్ కండీషనర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి
డేరాల (గూడెం కొత్తవీధి): జీకే వీధి-3 ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి శెట్టి నాగేశ్వరరావు మండల పరిధిలోని డేరాల గ్రామంలో బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ గ్రామస్తులను కలిసి తన ఎన్నికల గుర్తు అయిన 'ఎయిర్ కండీషనర్'పై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా శెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తాను ఏ రాజకీయ పార్టీ అండతోనో కాకుండా, ప్రజల మనిషిగా, స్థానిక బిడ్డగా ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. గ్రామంలో నెలకొన్న రహదారుల దుస్థితి, తాగునీటి ఎద్దడి, రైతుల సమస్యలు, యువతకు ఉపాధి అవకాశాల కొరత వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచాకే కాకుండా, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ జీకే వీధి-3 సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఆయనకు మద్దతు పలికారు.


