నాగేష్కు యువత నీరాజనం – ఆర్.వి. నగర్లో వెల్లివిరిసిన ఉత్సాహం
ఆర్.వి. నగర్ (జీకే వీధి): జీకే వీధి-3 ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శెట్టి నాగేష్కు గ్రామ యువత నుంచి అనూహ్య, అపూర్వ మద్దతు లభిస్తోంది. "మేమంతా మీ వెంటే ఉంటాం.. మీ గెలుపే మా లక్ష్యం" అంటూ యువత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ఆర్.వి. నగర్ గ్రామంలో ఎన్నికల సందడి పండగ వాతావరణాన్ని తలపిస్తోంది.
యువతంతా ఏకతాటిపైకి వచ్చి ర్యాలీగా తరలివచ్చి నాగేష్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా శెట్టి నాగేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామస్తులు, యువత చూపిస్తున్న అభిమానం, ఆదరణ వెలకట్టలేనివని, ఈ ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటానని ఉద్వేగంగా పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే, ఆర్.వి. నగర్ సమగ్ర అభివృద్ధి కోసం, మౌలిక వసతుల కల్పన కోసం అహర్నిశలు శ్రమిస్తానని హామీ ఇచ్చారు. యువత ఐక్యత, గ్రామ సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా తన ప్రయాణం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, గ్రామ పెద్దలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


