విశాఖపట్నం నందుగల సింధూర ఫంక్షన్ హాల్ లో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ (NCRC) జాతీయ ఉపాధ్యక్షుడిగా దాడి సత్యనారాయణని నియమించిన కమిషన్. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ (NCRC) ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని సింధూర ఫంక్షన్ హాల్‌లో జూన్ 2, 2025న నిర్వహించిన వినియోగదారుల అవగాహన కార్యక్రమం సందర్భంగా, గతంలో విశాఖపట్నం జివిఎంసీ డిప్యూటీ మేయర్‌గా సేవలందించిన దాడి సత్యనారాయణ గారిని జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలను జారీచేసింది.
ఈ కార్యక్రమానికి NCRC జాతీయ స్థాయి వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ ఎంవిఎల్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై, దాడి సత్యనారాయణకి నియామక పత్రాన్ని అందజేశారు. ఇదే కార్యక్రమంలో విశాఖ జిల్లాలోని 30 మంది సభ్యులకు వివిధ పదవుల్లో నియమించడం జరిగినది. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఫౌండర్ & చైర్మన్ నాగేశ్వరావు గారి పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, ఈ సందర్భంగా బీద మహిళలకు చీరలు మరియు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు: డా. ఎం. ప్రసాద్, జాతీయ ఉపాధ్యక్షుడు (మెడికల్ & ఫుడ్ సేఫ్టీ) బల్ల శ్రీనివాస్, ఏపీ రాష్ట్ర చైర్మన్ డా. అవినాష్, ఏపీ రాష్ట్ర చైర్మన్ (ఆపరేషన్స్ & అబ్జర్వర్) నైడాన ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి శ్రీనివాస్, పిఆర్వో టీ.రాము, సూర్యప్రకాష్, మల్లవరపు శంకర్ అందించిన మద్దతు మరియు సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. జాతీయ వినియోగదారుల హక్కుల కమీషమ్ దేశవ్యాప్తంగా వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచడం, వారి హక్కులను కాపాడడం మరియు న్యాయమైన వినియోగదారుల వ్యవస్థను ఏర్పరచడంలో అంకితభావంతో ముందుకు సాగుతోంది.