తాను పుట్టి పెరిగిన ఇంటిలో నివాసం ఉంటున్న ముస్లిం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేయూతనందించారు.
దక్షిణ నియోజకవర్గ 39 వ వార్డు కి చెందిన క్యాన్సర్ పేషంట్ మహమ్మద్ రహమతుల్లా కి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ. 10,000 ఆర్థిక సహాయం అందించారు. 39వ వార్డు అధ్యక్షుడు ముజీబుఖాన్ ద్వారా విషయం తెలుసుకుని వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాను అందిస్తున్న నిర్విరామ ఆర్థిక సహాయం లో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో పేదలు అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాసుపల్లి తన సొంత నిధులతో మెడికల్ ఖర్చులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. క్యాన్సర్ బారిన పడిన మహమ్మద్ రహమతుల్లా కి ధైర్యం చెప్పారు. అనారోగ్యానికి కారణమైన వాటికి దూరంగా ఉండాలన్నారు. మందుల కన్నా మనోధైర్యంతో క్యాన్సర్‌ను జయించవచ్చునని అన్నారు. మెడికల్ పరంగా ఎటువంటి సహాయం కావాలన్నా తనని నేరుగా సంప్రదించాలని వాసుపల్లి ఆయన కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో 39వ వార్డ్ ప్రెసిడెంట్ ముజుబ్ ఖాన్,జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్,సౌత్ మినర్టీ ప్రెసిడెంట్ బాబ్జి, సత్య, మాధురి, బుజ్జి, నూకరత్నం, సలీం, ప్రసాద్, వెంకటి, శ్రీను, వెంకటి తదితర్లు పాల్గొన్నారు.
