ఘనంగా అంబరానాoటిన ఉట్టి వేడుకలు...

శ్రీశ్రీశ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా అంబరానాoటిన ఉట్టి వేడుకలు...

కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న యువకులు భక్తులు...

ఉత్సాహభరితంగా సాగిన ఉట్టి కార్యక్రమంలో యమగాని సాయి గౌడ్ ఊట్టి కొట్టడం జరిగింది....

యమగాని సాయి సన్నాఫ్ మైసయ్య కొడుకు విజయం సాధించారు..

కనుల విందుగా ఊరు ఊరంతా ఉట్టి వేడుక వాతావరణం..



యాదాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో ఉట్టి వేడుకలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి వేద పండితులు హాజరై ఉట్టి వేడుకల్లో అత్యంత ప్రధానమైంది అని ఉట్టి కొట్టే సంబరం .ఈ సంబరంలో యువత ఉత్సాహంగా పాల్గొంటారు.ఉత్తరభారతంలో దీనిని దహి హండీ అని పిలుస్తారు. ఇంటికీ వెళ్లి మట్టికుండలో పెరుగు, పాలు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికికి వేరొకరు ప్రయత్నం చేస్తుంటారు. ఈ సంబరం అందరిలోనూ ఆనందాన్ని నింపుతుందని పెద్దలు భావిస్తుంటారు అని తెలిపినారు.అనంతరం శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్నీ గ్రామ ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో,సుద్దాల గ్రామ ప్రముఖులు,పెద్దలు మరియు విద్యార్దులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.