శాస్త్రీయ ఆధ్యాత్మిక జ్ఞాన విజ్ఞానములతో కూడిన ఒక మ్యూజియం నిర్మిస్తాం...

ప్రభుత్వ భూములలో 50 సెంట్లు తమ సంస్థకు ఇప్పించండి... ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం.



గత 89 సంవత్సరముల నుండి విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక సేవలు అందిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన విషయము అందరికీ తెలిసినదే. వివిధ మతాలు సంస్కృతులు భాషలు కల మన భరతమాత ఆధ్యాత్మిక విశ్వగురువు అయ్యింది. అన్ని మతాలు ఒకటి లేదా సమానము కాకపోయినా అన్ని మతాల సారము ఒక్కటే అంటూ, భగవంతుడు సర్వాత్మలకు తండ్రి అయిన ఆ పరమేశ్వరుని నియమనిష్ఠలతో ధ్యానించే బ్రహ్మకుమారీలు ఎటువంటి మత ప్రచారాలు చేయుట వారి లక్ష్యం కాదు. సత్యమైన ఆత్మ పరమాత్మ జ్ఞానాన్ని అన్ని వయసుల వారికి సహజముగా అర్థమయ్యేలా నైతిక విలువలను ప్రసారం చేస్తున్నారు. నేటి సమాజంలో వయసుతో సంబంధం లేకుండా మానవాళి అందరికీ నైతిక భౌతిక సామాజిక ఆధ్యాత్మిక విలువలను మా ప్రసంగాల ద్వారా ప్రబోధిస్తున్నారు. సర్వ మానవాళిని ఆత్మదృష్టి తో చూస్తూ తమ జీవితంలో క్రమశిక్షణ సత్ప్రవర్తన తామ అలవర్చుకొని ఇతరులుకు కూడా శారీరక మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం తమ ప్రసంగాల ద్వారా శిక్షణను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో సేవా కేంద్రాల అన్నింటి తరఫున సోదరి బ్రహ్మకుమారి రామేశ్వరి తమ 33 సంవత్సరముల ఆధ్యాత్మిక జీవితానుభవాన్ని జోడించి మన సింహాచలం పుణ్యక్షేత్రం యొక్క పరిసర కొండవాలు ప్రభుత్వ భూములలో 50 సెంట్లు తమ సంస్థకు ఇప్పించవలసిందిగా 2024 అక్టోబర్ 27వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుని కలిసి శాస్త్రీయ ఆధ్యాత్మిక జ్ఞాన విజ్ఞానములతో కూడిన ఒక మ్యూజియను నిర్మించేందుకు ఒక వినతిపత్రం సమర్పించారు. మరలా రెండవసారి 2025 సెప్టెంబర్ 4వ తేదీన క్యాబినెట్ అనంతరం మన ముఖ్యమంత్రికి సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వారి స్పందన ఆధారంగా కేవలం మాకు ప్రభుత్వ భూమిని 50 సెంట్లు పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో ఇప్పించవలసిందిగా సెప్టెంబర్ 20వ తేదీన మన జిల్లా కలెక్టర్ MN హరేందర్ ప్రసాద్ కి మరియు పార్లమెంటు సభ్యులు ముతుకపల్లి భరత్ కి వినతి పత్రాలు సమర్పించారు. అదేవిధంగా నగర మున్సిపల్ కమిషనర్ కి  కేతన్ కి కూడా వినతి పత్రాన్ని అందజేస్తామని అన్నారు. మన విశాఖపట్నం సింహాచలంలోనే ఈ స్థలాన్ని ఇప్పించవలసిందిగా ఎందుకు కోరుకున్నమంటే ఆ వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. మన విశాఖలో ఇలాంటి శాస్త్రీయ ఆధ్యాత్మిక జ్ఞాన విజ్ఞాన మ్యూజియం నిర్మించుట చాలా అవసరమని, బాల బాలికలు, యువత మొదలగు ప్రజానీకానికి అందరికీ ప్రయోజనదాయకమని ఈ విషయం ఎంపీ భరత్ ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ని కమిషనర్ ని తమ ప్రత్యేక శ్రద్ధ చూపించి దృష్టి పెట్టవలసిందిగా BK రామేశ్వరి సవనియంగా తెలియజేశారు. ఈ మ్యూజియం మరియు ప్రధమ చికిత్సలయం నిర్మించి లోకోపకారము చేసే పవిత్ర ఉద్దేశ్యమే తప్ప ఇతర ప్రలోభాలు స్వార్థంతో కూడిన ఉద్దేశము తమ సంస్థ వారికి లేవని నిస్కర్షగా పత్రికా సమావేశంలో బికే రామేశ్వరి చెప్పారు. ఈ పత్రిక సమావేశం ద్వారా మీడియా వారి వార్తలకు ప్రజలు మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మా సంస్థ ద్వారా మేము అందించే సేవలను సహకరించవలసిందిగా కోరారు.