దశల వారీ ఉద్యమాలకు సిద్ధమవుతాం. PDSO



ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలను ప్రభుత్వమే కొనసాగించకపోతే దశల వారీ ఉద్యమాలకు సిద్ధమవుతాం. PDSO



స్థానిక ఆదోని పట్టణంలోముఖ్య నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు తిరుమలేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో PPP మెడికల్ కాలేజీల విధానానికి ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూటమి వెనక్కి తగ్గడం లేదు అంటే అందులో లాభం ఎంత ఉందో స్పష్టం అవుతుంది. మెడికల్ కాలేజీలు ప్రభుత్వాలు నడపలేవని వాదన అసత్యం ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో డజన్ల కొద్ది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు విజయవంతంగా నడుస్తున్నాయి. అధికారంలోకి రాకముందు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ప్రవేట్ పార్ట్నర్షిప్ మార్గం నుంచి కూడా ప్రజలను మోసం చేయడమే అని అన్నారు . ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలో 10 కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిపిపి పద్ధతిలో నడపాలని తీసుకున్న నిర్ణయం పూర్తిగా విద్య వ్యతిరేకమని అన్నారు. ఆదోని, మదనపల్లె ,మార్కాపురం, పులివెందల, పెనుకొండ పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతిపురం కళాశాలలను 33 సంవత్సరాల లీజుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల 1500 ఎంబీబీఎస్ సీట్లు ప్రభావితమవుతాయని రిజర్వేషన్లు తగ్గి ఫీజులు అమాంతం పెరుగుతాయని ఆయన విమర్శించారు. ఈ విధానం పేద మధ్యతరగతి విద్యార్థులను వైద్య విద్య నుండి దూరం చేస్తోందని ప్రభుత్వం పారాదర్శకత లేకుండా కన్సల్టెన్సీల ద్వారా కళాశాలను ప్రైవేటుకరించడానికి కుట్రలు పొందుతుందని తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలో పిపిపి నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని జీవో 107 ,108 లను రద్దుచేసి అన్ని 17 కళాశాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము లేని ఎడల పెద్ద ఎత్తున దశలవారీ ఉద్యమాలతో ప్రభుత్వనికి వ్యతిరేకంగా పోరాడుతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ రాజేష్, జిల్లా నాయకులు బంగారు రాజు డివిజన్ సెక్రెటరీ శివ, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు..