రాష్ట్ర సమగ్ర శిక్ష వారి ఆదేశానుసారం విశాఖపట్నం జిల్లా పలు పాఠశాలల్లో కెరీర్ ఫెస్ట్ ల కార్యక్రమలను డిసెంబర్ 15 నుండి 18 వరకు నిర్వహించారు.
విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే వారి జీవిత లక్ష్యం ఏర్పడి వాటిని నెరవేర్చుకునే మార్గాలపై అవగాహన మరియు విద్యార్థులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో జిల్లా విద్యాశాఖ ఉన్నత అధికారుల పర్వేక్షణలో మొత్తం 112 ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో
1. కెరీర్ మోడల్ పోటీ 2. వృత్తి/వృత్తి దుస్తుల పోటీ 3. పోస్టర్/డ్రాయింగ్ పోటీలను నిర్వహించి, మండలస్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపించిన పాఠశాలను జిల్లా స్థాయిలో డిసెంబర్ చివరి వారంలో స్టాల్ లు ఏర్పాటు చేసి సర్టిఫికెట్ లు అందజేయనున్నట్టు జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎం. శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు.


