ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మరియు యువజన స్పోర్ట్స్ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి విశాఖపట్నం జిల్లాలో వివిధ ముఖ్యమైన పర్యాటక కేంద్రాలను పరిశీలించారు.
ఈ నేపథ్యంలో కైలాసగిరి పైన ఉన్న కొత్తగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ను మరియు వివిధ పర్యాటక కేంద్రంలను పరిశీలించి మరింత అభివృద్ధి చేయాలని ఇదే రకమైన అభివృద్ధిని మిగతా దగ్గర కూడా ఉండేలా చూడాలని కోరినారు.
కైలాసగిరి పైన పర్యాటక కేంద్రాలకు వచ్చే పర్యాటకులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను మరింత పెంచుతామని వివిధ పర్యాటక కేంద్రాలకు కొత్త బస్సులు రాగానే అభివృద్ధి చెందుతాయని తెలియజేసారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లాకు వంద ఎలక్ట్రికల్ బస్సులు మంజూరూ అయినాయని మరిన్ని బస్సులను విశాఖపట్నంకు కేటాయిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రితో పాటు VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, పార్వతీపురం శాసనసభ్యులు బూనే విజయ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి గీతా, రీజనల్ మేనేజర్ విశాఖపట్నం ఏపీఎస్ఆర్టీసీ బి అప్పలనాయుడు, అసిస్టెంట్ మేనేజర్ మూర్తి, చీఫ్ సెక్యూరిటీ ఏపీఎస్ఆర్టీసీ మోహన్ పాల్గొన్నారు.



