ఘనంగా శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి వేడుకలు



రాజమహేంద్రవరం, ఆనం కళాకేంద్రం లో బి. సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిధి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ బి. సి వెల్ఫేర్ మంత్రివర్యులు శ్రీమతి సావిత కి శాలువా తో సత్కరించి ఘన స్వాగతం పలికిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు "బత్తుల బలరామకృష్ణ" .



ఈ సందర్భంగా శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ

👉దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు మరియు ప్రముఖ సంఘ సంస్కర్త. 

👉సమాజంలో విద్య, ఐక్యత కోసం పోరాడిన ఆయన, శెట్టిబలిజలను ఏకం చేసి వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. 

👉కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయన సేవలను గుర్తిస్తూ ఏటా మార్చి 23 న ఆయన జయంతిని పురస్కరించుకుని అధికారిక రాష్ట్ర పండుగగా (State Festival) ప్రకటించడం జరిగింది . 

👉ఆయన గొప్ప సంఘ వ్యవస్థాపకుడు, శెట్టిబలిజల ఐక్యత కోసం, వారి హక్కుల కోసం "శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని" స్థాపించారు.

👉1920 సెప్టెంబర్ 25న, తూర్పు గోదావరి జిల్లా బోడసకుర్రులో కుల సమావేశాన్ని నిర్వహించి, ఈడిగ వర్గాన్ని శెట్టిబలిజగా గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 

👉ఆయన విద్య, సామాజిక సంస్కరణలు: గాంధీజీ కంటే ముందే వయోజన విద్య వంటి కార్యక్రమాలను చేపట్టారు, బాల్యవివాహాలను వ్యతిరేకించారని తెలిపారు. ఈ కార్యక్రమలో స్థానిక శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు వివిధ శాఖల చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు.