విజయవాడ నోవాటెల్ హోటల్ లో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఘనంగా జరిగింది.
రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామ కృష్ణ పాల్గొని, రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంబదించి ముఖ్య అంశాలను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కి తెలియజేశారు.
అలాగే విద్యా వైద్యం రోడ్లు డ్రైనేజ్ ల నిర్మాణం, త్రాగునీటి సరఫరా, రైతుల సంక్షేమం వంటి ముఖ్య అంశాలను తెలియజేస్తూ వారికి వినతులు అందజేశారు.

