ఈ నెల 15 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు



AP: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతి నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలను పురస్కరించుకుని టీటీడీ, పోలీస్, మున్సిపల్ విభాగాలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక విద్యుద్దీపాలు, ఆధ్యాత్మిక అలంకరణలు,ప్లెక్సీలతో నగరానికి కొత్త శోభ తీసుకొస్తున్నారు.