మాజీ మంత్రి అమర్నాథ్ కు నోటీసులు




మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) అధికారులు నోటీసులు ఇచ్చారు. గాజువాక చట్టివానిపాలెంలోని సర్వే నెంబర్ 79/9Aలో నాలుగు అంతస్తుల భవనం నిర్మించడంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. వారంలో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమర్నాథ్కు GVMC నోటీసులు జారీ చేసింది.