బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన జయంత్ సాయి స్వరూప్...

మురళి నగర్‌లో జరిగిన ఇండియన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీలో జై భీమ్ బాక్సింగ్ క్లబ్ కి చెందిన యువకులు పాల్గొనగా 46 ఫ్లై వెయిట్ కేటగిరీలో జయంత్ సాయి స్వరూప్ విజయాన్నందించి బంగారు పతకం గెలిచారు. 



ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువజన అధ్యక్షుడు మధుబాబు మాట్లాడుతూ  క్రీడల్లో  ఆసక్తి, నైపుణ్యత ఉండి ఆర్థికంగా  వెనక పడిన ప్రతి క్రీడాకారునికి తెలుగుదేశం పార్టీ తరుపున ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్తాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో TDP యువజన అధ్యక్షుడు మధు బాబు, జై భీమ్ బాక్సింగ్ క్లబ్ అంతర్జాతీయ బాక్సింగ్ కోచ్ టైసన్ రామారావు, UFC మరియు MA బాక్సింగ్ కోచ్ ప్రశాంత్ రెడ్డి, సంపంగి లీలా ప్రసాద్, నేవీ బాక్సర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.