మీ ఎమ్మెల్యే మీ ఇంటికి కార్యక్రమంలో భాగంగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సిఎంఆర్ఎఫ్ రెండవ విడత చెక్కులు పంపిణీలో భాగంగా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామపంచాయతీలో లబ్ధిదారులకు చెక్కులను అందించారు. అదే గ్రామపంచాయతీలో పర్యటించి గ్రామస్తుల ద్వారా పలు సమస్యలు తెలుసుకున్నారు, ముఖ్యంగా పక్కా ఇళ్ల సమస్యను గమనించి త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ రేషన్ దుకాణాన్ని సందర్శించి నిల్వలను పరిశీలించారు. ఇటీవల వర్షాలకు కోతకు గురైన రోడ్లను పరిశీలించి మండలంలో కోతకు గురైన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులుఅధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.