అమరుల త్యాగాన్ని ఎత్తి పడదాం... నూతన ప్రజాస్వామిక విప్లవానికై పోరాడుదాం...మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు నుపా భాస్కర్, కల్లూరి కిషోర్, మండల కార్యదర్శి కోర్స రామకృష్ణ.
ములకలపల్లి మండలం పాత గుండాలపాడు పంచాయితీ పగడల్ల నగర్ గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో పోడియం వీరస్వామి సంస్కరణ సభ నిర్వహించడం జరిగింది.ఈ అమరవీరుల సంస్కరణ సభ పార్టీ మండల కమిటీ సభ్యులు కారం వెంకటేష్ అధ్యక్షత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూపా భాస్కర్,జిల్లా కమిటీ సభ్యులు కల్లూరి కిషోర్, నిమ్మల రాంబాబు ములకలపల్లి, అన్నపూరేడ్డిపల్లి సంయుక్త మండలాల కార్యదర్శి కోర్స రామకృష్ణ పాల్గొని పొడియం వీరస్వామి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పార్టీ గ్రామ కార్యదర్శి కోండ్రం కృష్ణ అమరవీరుల జెండాను ఎగరవేయడం జరిగింది.
అనంతరం ఏర్పాటు చేసిన అమరవీరుల సభలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూప భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు కల్లూరు కిషోర్, నిమ్మల రాంబాబు, పార్టీ మండల కార్యదర్శి కొర్సా రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ.ఉన్నతమైనది ప్రాణం-జీవితం తమ జీవితం తమ కోసమే కాకుండా ప్రజల కోసం అత్యున్నతమైన వర్గ పోరాటాల సిద్ధాంతం కమ్యూనిజం కోసం ధారపోసిన త్యాగధనుల చరిత్ర మహోన్నతమైనది దానిని సదా గుర్తు చేసుకోవాలి. వారి త్యాగాన్ని పోరాటాన్ని సిద్ధాంతాన్ని ఎత్తి పట్టుకొని,స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలి,ఎర్రజెండా రెపరెపల్లో పోరాటాల సవ్వడిలో అమరమూర్తుల ఆశల స్వప్నలను వీక్షించాలి. కమ్యూనిస్టు ఉద్యమంలో ఎందరో తమ ప్రాణాలర్పించారు. భారత కమ్యూనిస్టు ఉద్యమం దాదాపు వందేళ్ళ చరిత్ర దగ్గరేంది 1925లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ కుట్ర కేసుల్ని నిర్బంధాన్ని, అణిచివేతనూ,నిషేధాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగింది.కార్మిక,కార్షిక పోరాటాల ఎర్రజెండాగా నిలిచింది.పీడితల ఆత్మబంధువై నడిచింది ఆంగ్లయ సామ్రాజవాదానికి వ్యతిరేకంగా, జమీందారి, జాగేర్దారి, పెత్తం దారి విధానాలకు వ్యతిరేకంగా ఎన్నో విరోచిత పోరాటాలను నిర్మించింది. బొంబాయి, సూరత్, కలకత్తా, ఆహ్మదాభాద్ లాంటి చోట్ల పెద్ద ఎత్తున కార్మిక ఉద్యమాలు నిర్మించి, భారత కార్మిక వర్గాన్ని పోరాటోస్ముకులను చేసింది. తెలుగు మాగాణం మీద సాగిన విరోచిత తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగువేల మంది కమ్యూనిస్టు యూదులు వీరమరణం పొందారు అని.నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి సంఘం సింగమై కదిలి,జమీందారీ,జగీర్ధారీ కోటలు కూల్చి,మూడువేల గ్రాములలో ఎర్రజెండా రాజ్యాన్ని స్థాపించింది. పదిలక్షల ఎకరాల భూమిని పంచి, వెట్టి చాకిరిని రద్దు చేసిన ఆ పోరాటం చారిత్రాత్మకమైనది. మట్టి మనుష్యులను విప్లవ యోధులుగా మలిచిన చరిత్ర దానిది.1951 నుంచి 1967 దాకా కమ్యూనిస్టు ఉద్యమంలో స్తబ్దత,అంతర్మధనం నడిచింది. లక్షల పరితుల 1967 లో నగ్జల్భరి రైతుల భూమి పోరాటం. 11 మంది బలిదానం భారత వినిలాకాశంలో ఒక కొత్త మెరుపులను ఆవిష్కరించింది. నగ్జల్భరి, శ్రీకాకుళం, గోపి వల్లభాపూర్ తదితర ఎన్నో చోట్ల పోరాటలు బద్దలైనాయి. ఆ తర్వాత వాటి అనుభవాలను బైరిజు వేసుకుంటూ గోదావరి లోయ పోరాటం సాగింది. ఈ పోరాటాలన్నీ రివిజనిజం మీద, మితవాదం మీద ఆగ్రహంతో మరో కోసకు కొట్టుకపోయి అతివాద అవకాశవాద విధానాలకు బలయ్యాయి అని. ఎన్నో సంఘర్షణాలు-ఎన్నో అనుభవాలు. పీడిత ప్రజల అంకితభావం, ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడం ఒక విలువగా, విప్లవ తేజంగా భావించారు. యాబై అయిదు ఏడ్ల కాలంలో విప్లవ ఉద్యమం కోసం తమ ప్రాణాలర్పించారు. భారత విప్లవ ఉద్యమంలో, స్వతంత్ర ఉద్యమంలో, భగత్ సింగ్, ఆజాద్, అల్లూరి, కర్తార్ సింగ్ లాంటి వారు ఎందరో వీర కిశోరాలు తృణప్రాయంగా ప్రాణాలర్పించారు.ఇక నాగ్జల్భరి తరం లో కమ్రెట్స్ సత్యనారాయణ సింగ్, చారు మంజుందారీ, కాను సన్యాల్, దేవులపల్లి, తరిమెళ్ళ నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి,కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి. గోదావరి లోజ పోరాట వారదులుగా సరైన పంథా కోసం జీవితం అంతా శ్రమించిన కామ్రేడ్స్ రాయల సుభాష్ చంద్రబోస్,టీవీ కృష్ణ,కోట్ల రామ నర్సయ్య,రామచంద్రయ్య గడ్డం వెంకట్రామయ్య, అమరవీరులు పిట్ల ఎల్లయ్య, ఏనుగు అప్పయ్య విద్యార్థి ఉద్యమ నాయకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి లాంటి వారు ఎందరో అమరులయ్యారు ఒక్కరా... ఇద్దరా ఎన్నో వందల మంది ప్రాణార్పణ చేశారు అని ఆ అమర యోధులందరినీ పేరుపేరునా తలుచుకుందాం. నివాళులర్పిద్దాం. వారి త్యాగాలను గానం చేద్దాం. వారి బాటాను ఎంచుకుందాం. వారు ఆశించిన సోషలిస్టు రాజ్యం, ప్రజారాజ్య నిర్మాణం కోసం ప్రజలను వర్గ పోరాటాలలోకి, సామూహిక తిరుగుబాటులోకి సమీకరిద్ధాం. ఈ పరిస్థితులలో విప్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి శపదం పునాలి. ఉద్యమాలలో ప్రాణాలర్పించిన అమరులను యాది చేసుకోవడం మన బాధ్యత. మరణించిన అమరుల స్ఫూర్తితో ఉద్యమాలలో ముందుకు పోవాలని మాట్లాడారు. ఈ సభలో అరుణోదయ కళబృందం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యురాలు నుపా సరోజినీ, సభ్యులు పుప్పాల నాగేశ్వరరావు, వెల్కమ్ చలమన్న, పివైఎల్ డివిజన్ నాయకుడు కురసం ముకేష్, పార్టీ గ్రామ కార్యదర్శి కారం దూలయ్య కట్టం కోశయ్య,కారం కన్నారావు, వర్సా బాబురావు, మడివి సునీల్ వెలకం వెంకటేష్, సోయం రాము, పోడియం పెద్ద రవి, అరుణోదయ కళాకారుల బృందం తదితరులు పాల్గొన్నారు.