గుండాల ఎస్ఐ తేజం రెడ్డి పర్యవేక్షణ ప్రతిభను ప్రశంసించిన గుండాల ప్రజలు మరియు ప్రముఖులు.

ప్రశాంతంగా ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు... ఎప్పటికప్పటికీ అప్రమత్తం పరుస్తూ పల్లెల్లో ప్రశాంతంగా విఘ్నేశ్వరుని పూజలు.



యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు గణేష్ ఉత్సవ నిర్వాహకులు గుండాల ఎస్సై తేజం రెడ్డి సేవలను కొనియాడారు వివిధ గ్రామాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ నిర్విరామంగా తొమ్మిది రోజులపాటు సేవలందించారని పేర్కొన్నారు గ్రామాల్లో వినాయక నిమజ్జనాల్లో గాని పూజా కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పటికీ సూచనలు చేస్తూ నిర్విరామంగా కృషి చేసినందుకు పలువురు ప్రశంసల జల్లులు కురిపించారు వారు సేవలు గుండాల మండలానికి ఎంతగానో ఉపయోగపడతాయని మీడియా మిత్రుడు దంతురి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.