సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉద్యమ కెరటం మన కల్లుగీత కార్మిక సంఘము

హలో గౌడన్న చలో గుండాల..

ఈ నెల 18న మండల 2వ  మహాసభ ను జయప్రదం చేయండి: కల్లు గీత కార్మిక సంఘం పిలుపు...

తేది 18-9-2025 గురువారం ఉదయం 10:00 గంటలకు స్థలం: వాసవి గార్డెన్స్, గుండాల.

కల్లుగీతా కార్మిక సంఘా నాయకుల చేత పోస్టర్ ఆవిష్కరణ.

పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా గీతా కార్మిక జిల్లా నాయకులు దంతురి మల్లయ్య గౌడ్ మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉద్యమ కెరటం మన కల్లుగీత కార్మిక సంఘము గుండాల మండల వాసవి మహాసభ సెప్టెంబరు 18వ తేదీన వాసవి గార్డెన్స్ వద్ద నిర్వహిస్తున్నాము. మండలంలోని గీత కార్మికులు, శ్రేయాభిలాషులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.



1957లో మొట్టమొదట కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పడ్డ సంఘం మన కల్లుగీత కార్మిక సంఘము అని అన్నారు. గీత కార్మిక వృత్తిలో వృత్తిలో పడుతున్న ఇబ్బందులను పట్టేదారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్నా సమయంలో విదానానికి వ్యతిరేకంగా అనేక అడ్డంకులను ఎదుర్కొన్నాము. పాలకులు ఎవరైనా కార్మికుల పక్షాన నిలబడి అనేక హక్కులు సాధించుకున్నాము, ఇంకా సాధించుకోవాల్సింది ఎంతో ఉంది. అందుకు కంకణ బద్దులై కదులుదాం. 25 వేల మందితో కనివిని ఎరుగని రీతిలో సభ నిర్వహించి పాలకులకు కనువిప్పు కల్పించాలని ప్రతి గీత కార్మికుడికి 2 లక్షల రూపాయలు సబ్సిడీ రుణం అందించాలని కోరుదాం అని  అన్నారు. 



కల్లుగీత కార్మిక సంఘం గుండాల 2వ మండల మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కల్లు గీతా కార్మిక సంఘము మండల అధ్యక్షుడు సూదగని రామ చంద్రయ్య, మండల కార్యదర్శి బత్తిని బిక్షం, గీతా కార్మిక జిల్లా నాయకులు దంతురి మల్లయ్య గౌడ్, బిసు దశరథ, బిసు సోమయ్య, బిసు ఐలయ్య, డి శ్రీనివాస్ గౌడ్, దంతురి చంద్రయ్య గౌడ్, తదితరులు పాల్గోని పోస్టర్ ఆవిష్కరణ చేసి మీటింగ్ విజయవంతం చేయాలని కోరారు.