కష్ట నష్టాలో, బాధ బాధ్యతలలో బాసటగా నిలుస్తున్న బాల్యమిత్రులు.....
జీ.ప.ఉ.పా సుద్దాల 2000-01 పదవ తరగతి మిత్రునికి 15500/- ఆర్థిక సహాయం....బాల్య మిత్రుల ఐక్యత దేవుడిచ్చిన ఒక గొప్ప వరం...
దశ దిన కార్యక్రమం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన నిరుపేద నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జంపాల లక్ష్మయ్య ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ మరణించడంతో వారి కుమారుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుద్దాలలో 2000-01 సంవత్సరంలో పదో తరగతి అభ్యసించారు, తండ్రి అకాల మరణంతో బాధపడుతున్న మిత్రునికి వారి బాల్యమిత్రులు బాచుటగా నిలుస్తూ వారి తండ్రి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు, అదేవిధంగా వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామంటూ ఆర్థికంగా సహాయం 15,500 అందజేశారు, ఈ సందర్భంగా పలువురు మిత్రులు మాట్లాడుతూ మాతోపాటు పదోతరగతి విద్యను అభ్యసించి కష్ట పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్న జంపాల సైదులుకు భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలియజేశారు అదే విధంగా మునుముందు వారి కుటుంబానికి అండగా ఉంటామని చేదోడు వాదోడుగా నిలుస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంపాల సోమన్న,దొంతి యాదగిరి,చేవ్వ రవీందర్,దంతురి శ్రీనివాస్ గౌడ్, పులా స్వామి,కదిరం పాండు తదితరులు పాల్గొని సానుభూతి తెలిపారు.
