సివి రామన్ అకాడమీ లలిత కళ అకాడమి సికింద్రాబాద్ వారు ఉగాది సంబరాలు లో భాగంగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు అవార్డులు కార్యక్రమం ప్రధాన ఉత్సవం బహుమతి ప్రధానం విశిష్ట సన్మానం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షులు బండి రామాంజనేయులు మచిలీపట్నం నుండి గ్రామీణ వైద్య ప్రవీణ అవార్డుకు ఎన్నికైనారు పేదలకు ఉచిత వైద్య సేవలు చేస్తూ సామాజిక సమాజ సేవలో అనేక సేవలు అందజేసి ప్రజలకు ప్రభుత్వానికి వారధి వలె అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేయు వైద్య కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తూ కరోనా సమయంలో పేద ప్రజలకు నిత్య అన్నదానం ఉచిత మందులు పంపిణీ సహజ అధికారులు అందించినందుకు గాను సమాజంలో ఉత్తమ సేవలు అందజేసి ఉత్తమ పురుషుడుగా ఉత్తమ గ్రామీణ వైద్యుడిగా సేవలందించిన గత 30 సంవత్సరాలుగా వైద్య రంగంలో పేదలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు ప్రజా వైద్యుడుగా ప్రధమ వైద్యుడిగా ఆత్మీయుడుగా ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న బండి రామాంజనేయులు గ్రామీణ వైద్యున్ని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించడం జరిగింది.
బండి రామాంజనేయులు గ్రామీణ వైద్యుడికి గ్రామీణ వైద్య ప్రవీణ అవార్డును బహూకరించి స్వర్ణఖంకనం రజిత కిరీటం తో ఘనంగా సన్మానించడం జరిగింది హైదరాబాద్ నందు గ్రామీణ వైద్య ప్రవీణ అవార్డు గ్రహీత బండి రామాంజనేయులు ఈ అవార్డు తనకు రావడం తనకు ఎంతో ఆనందాన్ని బాధ్యతను కలగజేసిందని ముందు ముందు ఇంకెన్నో కార్యక్రమాలకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ అవార్డును ఎన్నిక చేసిన కమిటీకి అవార్డు ప్రధానం చేసిన లలితా కళా అకాడమీ సికింద్రాబాద్ వారు ముఖ్య అతిథులకు, గౌరవ అతిధులకు, విచ్చేసిన సభ్యులకు ఈ అవార్డు ఇచ్చిన సంస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసినారు.