మాల మహానాడు అత్యవసర సమావేశం

డా.బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు జల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన "మాల మహానాడు అత్యవసర సమావేశం" జరిగింది. 



ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు (పి.వి. రావు) ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు మాలల పై జరుగుతున్న కుట్ర పూరిత రిజర్వేషన్ దానివల్ల జరిగే పరిణామాలు, సంక్షేమ పథకాలతో మాలలకు జరుగుతున్న అన్యాయాలపై సమావేశం ముక్త కంఠంతో ఖండించింది. భవిష్యత్ లో జరిగే కార్యక్రమాలపై మాల సోదరులకు దిశ నిర్దేశం చేసారు. ఈ కార్య్రమంలో మట్టా వెంకటరావు ,పెయ్యాల పరసరాముడు, మాజీ సర్పంచ్ నక్కా సంపత్, పినుమాల చిట్టి బాబు, అయినవిల్లి మాలమహానాడు నాయకులు గీడ్ల వెంకటేశ్వరరావు, సరేళ్ళ సత్య నారాయణ ,, మాగం సర్పంచ్ కాశీవి.వి. సత్య నారాయణ,అయినవిల్లి లంక సర్పంచ్ శ్రీ మతి కుమ్మరి మాధవి రమణ, దాకారపు సత్య నారాయణ, కుసుమ బహుగుణ, తదితర నాయకులు, కార్యకర్తలు అత్యధికంగా పాల్గొన్నారు.