వేసవి కాలంలో దొంగతనాల నివారణ గురించి గుండాల పోలీస్ వారి ముఖ్య సూచనలు-ఎస్‌ఐ సైదులు గుండాల పోలీస్ స్టేషన్
గుండాల మండలం ఎండాకాలం రాత్రి సమయాలలో ఆరుబయట నిద్రించేటప్పుడు మీ ఒంటిపై విలువైన ఆభరణాలను ధరించకండి.ఇంటిలో ఒకరైనా పడుకునేట్లు చూడండి, లేదా ఇంటి తాళం పగులగొట్టి లేదా ఇంటి వెనుకనుండి మీ ఇంటిలోనికి ప్రవేశించి ఇంటిలో ఉన్న విలువైనవాటిని, నగదును దోచుకొనిపోతారు మీరు ఊరికి లేదా ట్రిప్ లకు వెళ్ళు సమయంలో ఇంటిలో విలువైన వస్తువులు, ఆభరణాలు, మరియు నగదు ఉంచకండి. వాటిని బ్యాంక్ లాకర్ లో లేదా భద్రమైన చోట దాచుకోవడం ఉత్తమం.బీరువా తాళం చెవులు బీరువా పైన, పరుపు కింద, పోపుల డబ్బాలలో పెట్టకండి. సురక్షితమైన ప్రదేశం లో ఉంచండి.ఇంటిముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి గడియ పెట్టకండి. స్మార్ట్ లాక్స్ లేదా మొబైల్ నియంత్రిత భద్రతా వ్యవస్థలను ఉపయోగించండి.
ఇంటిలోపల మరియు బయట లైటు వేసి ఉంచండి.ఇంటి బయటి గేట్ కు లోపలినుండి తాళం వేయండి.పేపర్ బాయ్ మరియు పాల వాడిని రావద్దని చెప్పండి.నమ్మకమైన వాచ్ మన్ ను మాత్రమే నియమించుకోండి.మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీ ప్రక్కన ఉండే నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి.ఊరికి వెళ్ళిన తరువాత కూడా అప్పుడప్పుడు మీ ప్రక్క ఇంటి వారికి ఫోన్ చేసి మీ ఇంటి భద్రతా వివరాలు తెలుసుకుంటూ ఉండండి.
మీ ఇంటికి సిసి కెమెరాలను సొంతంగా ఏర్పాటు చేసుకొని డివిఆర్ ని రహస్య ప్రదేశాలలో భద్రపరచుకోవాలి.మొబైల్ యాప్ ద్వారా సిసి కెమెరాలో రికార్డ్ అవుతున్న దృశ్యాలను చూస్తుండాలి. ఏదైనా అనుమానాస్పద కదలికలు గుర్తిస్తే మీ ప్రక్కయింటి వారిని స్థానిక పోలీస్ వారిని అప్రమత్తం చేయాలి.కమ్యూనిటీ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది, భద్రత ఎక్కువగానూ ఉంటుంది.మీ టూర్ వివరాలను ఎట్టి పరిస్థితిలోనూ సోషల్ మీడియా లో షేర్ చేయకండి.
మీ వాహనాలను మీ ఇంటి కాంపౌండ్ లోపల లేదా సురక్షిత ప్రదేశం లో పార్క్ చేసి తాళంచెవిని మీ వెంట తీసుకెళ్లండి.మీ ప్రయాణం లో అపరిచితుల వద్దనుండి తినుబండారాలను తీసుకోకండి. మీ వెంట విలువైన వస్తువులను తీసుకెళ్తున్నట్లయితే అట్టి బ్యాగ్ ను మీతోనే జాగ్రత్తగా ఉంచుకోండి.మహిళలూ మీరు ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు, ఇంటి ముందు ముగ్గు వేస్తున్నప్పుడు మీ మెడలోని బంగారు వస్తువులు జాగ్రత్త. మెడ చుట్టూ కొంగు లేదా దుపట్టా కప్పుకోండి, అపరిచితులు మీతో మాట్లాడడానికి దగ్గరగా వస్తే జాగ్రత్త గా ఉండండి, దూరంగా నిలబడి మాట్లాడండి, అనుమానం వస్తే ఇంట్లో వాళ్ళకు చెప్పండి.మీకు ఎవరి కదలికలమీదనైనా అనుమానం వస్తే టోల్ ఫ్రీ నెంబర్ 100/112 కు కాల్ చేసి చెప్పండి లేదా రాచకొండ కంట్రోల్ రూమ్ నెం: 87126 62666 లేదా వాట్సప్ కంట్రోల్ నెం: 8712662111 కు డయల్ చేయండి వెంటనే స్పందిస్తాము.సూచన: మీ బ్యాంక్ అకౌంటు, ఏ.టి.ఎం కార్డ్, ఓ. టి. పి. వివరాలను ఎవరికీ చెప్పకండి, సైబర్ మోసాగాళ్ళ వలలో చిక్కకండి. ఏ బ్యాంక్ వారు కూడా ఈ వివరాలు అడగరని తెలుసుకోండి.మీ భద్రత మీ చేతుల్లోనే సదా నీ సేవలో.. గుండాల పోలీస్.