కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలనీ.... ప్రజా నేస్తం కామ్రేడ్ జే కే ఆర్, జే ఎస్ ఆర్ సార్ డిమాండ్..
ఆపరేషన్ కగార్ పేరిట సాగిస్తున్న నరమేధాన్ని ఆపాలనీ ప్రధానమంత్రి కి విజ్ఞప్తి చేసిన కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు..
శాంతి చర్చలకు సానుకూలమైన పరిస్థితి కొరకు కాల్పుల విరమణ ప్రకటించాలనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జే కే ఆర్, జె ఎస్ ఆర్ డిమాండ్...!
కేంద్రంలో మూడోసారి అధికారానికి వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వాన వున్న ఆరెస్సెస్- బిజెపి ప్రభుత్వం మధ్య భారతదేశంలో మావోయిస్టులను అణచే పేరిట ఆపరేషన్ కగార్ పేరిట 2024 జనవరి నుండి గత 16 నెలలుగా యుద్ధాన్ని కొనసాగిస్తూ, ముఖ్యంగా ఆ ప్రాంతంలోని ఆదివాసులపై నరమేధాన్ని కొనసాగిస్తోంది. ' అభివృద్ధి పేరిట, రాజ్యాంగం, చట్టాలలో ఆదివాసులకున్న హక్కులను కాలరాస్తోంది. అక్కడి ప్రకృతి వనరులు, ఖనిజ సంపద దేశ, విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేయటానికి, పర్యావరణ విధ్వంసమేగాక, ఆదివాసులను నిర్వాసితులను చేసి, అక్కడ నుండి తరిమివేయటానికి అన్ని విధాలుగా చేస్తున్న దాడుల్లో భాగమే ఈ యుద్ధం. మధ్య భారతంలోని దండకారణ్యం ప్రాంతంలో రాష్ట్రాల సాయుధ పోలీసులతో పాటు, కేంద్ర ప్రభుత్వం పారా మిలటరీ సాయుధ బలగాలతో క్యాంపులు పెట్టి, కూంబింగ్ ఆపరేషన్లతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోందనీ... ప్రముఖ కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జే కే ఆర్, జె ఎస్ ఆర్ సార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్కౌంటర్ల పేరిట కొద్దిమంది నుండి వందలాది మనుషుల దాకా కాల్చి చంపటం సాధారణమయింది. ఇందులో భాగమే ఏప్రిల్ 21 నుండి కర్రెగుట్టల ప్రాంతాన్ని వేలాది మంది పోలీసు, పారా మిలటరీ బలగాలు చుట్టుముట్టి, జంతువులను వేటాడినట్లుగా వేట కొనసాగుతోంది. కగార్ యుద్ధం ప్రారంభించి, ఇప్పటికే దాదాపు 500 మందిని చంపగా, అందులో దాదాపు మూడవ వంతుకు పైగా అమాయక ఆదివాసులున్నారని మీడియా వార్తలు తెలియచేస్తున్నాయి. అత్యంత ఆందోళనకరమైన విషయమేమంటే, నిరాయుధులనూ, గాయాలై పట్టుబడిన వారిని కూడా చిత్రహింషలు పెట్టి కాల్చివేస్తునారని కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి దేవాన్ష్ బోరన్న జెకెఆర్ గారి... జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలపై అత్యాచారాలు, హత్యలు తరచుగా జరుగుతున్నాయి. పాకిస్తాన్ బోర్డర్లో, చైనా బార్డర్లో, బంగ్లాదేశ్ బాడర్ లో, ఇంకా వివిధ దేశాల మన దేశానికి ప్రమాదం ఉండే ప్రాంతాలలో ఉండాల్సిన భారత సైనికులు, రకరకాల పోలీస్ బలగాలు దాదాపు 15 లక్షల మంది 5 లక్షల మంది డిఆర్జి మాజీ నక్సలైట్లతో కూడిన ప్రవేట్ అంతకముఠాలు మొత్తం 20 లక్షల మంది దాకా కర్రగుట్టలు మరియు చత్తీస్‌గఢ్ అడవులు గాలిస్తున్నాయని... ఒక్క మావోయిస్టుకు పదివేల మంది పోలీస్ బలగాలను కేటాయించాలని బాధితుల బంధువు, ప్రజా నేస్తాం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు. ప్రజలను టెర్రరైజ్ చేసే భయానక వాతావరణం ఏర్పడింది. ఈ ప్రాంతంలోని ఆదివాసులు ఎప్పుడేమి జరుగుతుందో, ఎవరి మరణవార్త వినాల్సి వస్తుందోననే భయానక స్థితిలో వున్నారు.
కగార్ పేరిట సాగుతున్న నరమేధాన్ని ఆపాలని హక్కుల సంఘాలు, మేధావులు ప్రారంభం నుండీ వ్యతిరేకిస్తునే వున్నారు. ఇందులో భాగంగానే మార్చి 24 హైదరాబాద్‌లో జరిగిన మేధావుల సమావేశములో కగార్‌ను ఆపి, శాంతి చర్చల ద్వారా మధ్య భారతంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వానికీ, మావోయిస్టు పార్టీకి విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందనగా, మావోయిస్టులు ప్రభుత్వంతో శాంతి చర్చలకు మార్చి 28న తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. అయితే, ఇందులో కొన్ని షరతులు పెట్టారు. ఏప్రిల్ 8న చేసిన ప్రకటనలో మరింతగా ముందుకు వెళ్ళి, తమ శ్రేణులకు శాంతి చర్చల అనుకూల వాతావరణం ఏర్పరిచే విధంగా కార్యక్రమాలు (ముందస్తు దాడులు, తమంతట తాము ముందుగా కాల్పులు చేయకుండా వుండటం) చేపట్టాలని నిర్ణయం ప్రకటించారు. ప్రాజెక్టుల విషయంలో "ఆదివాసులను వారి జల్, జంగిల్, జమీన్ నుండి బేదఖలు చేసి, పర్యావరణానికి నష్టం కలిగించే ప్రాజెక్టులను మేము వ్యతిరేకిస్తాం" అని స్పష్టీకరించారు. ఏప్రిల్ 17 ప్రకటనలో "ఇరువైపుల నుండి ఒక నెల కాల్పుల విరమణ జరగాలని మేము కోరుకుంటున్నాం. శాశ్వత పరిష్కారం కోసం ముందుకు సాగుదాం" అని పేర్కొన్నారు. నెల కాల్పుల విరమణ అవసరాన్ని కూడా వివరించారు. "చర్చల్లో మా వైపు నుండి ప్రాతినిధ్యం వహించే మధ్యవర్తి ప్రతినిధి బృందాన్నీ, మా పార్టీ ప్రతినిధులనూ నిర్ణయించటానికి మా కేంద్ర కమిటీ, స్పెషల్ జోనల్ కమిటీ నాయకత్వ కామ్రేడ్లను కలవడం అవసరం. వారిని కలవటానికి నాకూ, నా సహచరులకూ భద్రత హామీ వుండాలి. అందుకోసం, ప్రభుత్వ సాయుధ దళాల కార్యకలాపాలను ఒక నెల పాటు నిలిపివేయాలి" అని పేర్కొన్నారు.
రూపేష్ ఇచ్చిన ఇంటర్వూలో అనేక విషయాలపై వివరణలు ఇవ్వడం జరిగింది. " శాంతి చర్చల్లో భాగంగా ఆయుధాల విషయం కూడా చర్చిస్తామనీ, దీని విషయంలో కమిటీ చర్చించి, సముచిత నిర్ణయం తీసుకుంటుందనీ, ప్రజా విప్లవోద్యమం కొనసాగుతుందనీ పేర్కొనుట జరిగింది. ఏప్రిల్ 24న ఇచ్చిన ప్రకటనలో సమయ వ్యవధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి, ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాలి. శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం హత్యాకాండను ఆపాలి. " అని పేర్కొనుట జరిగింది.
అయితే, కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా అమిత్ షా గత విధానాలనే పునరుద్ఘాటిస్తూ, కగార్ యుద్ధాన్ని కర్రెగుట్ట చుట్టివేతతో మరింత తీవ్రం చేశాడు. నక్సలైట్లు ఆయుధాలు విడిచిపెట్టి జన జీవనస్రవంతిలో కలవాలనీ, లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామనీ, ఆయుధాల పని సాయుధ బలగాలు చూస్తాయనీ పదే పదే అమిత్ షా మాట్లాడుతున్నాడు. శాంతి అనేది రెండు వైపులా కోరుకుంటేనే సాధ్యం. ఒక వైపున ఎంతగా కోరుకున్నా సాధ్యం కాదు. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు వస్తున్నది, శాంతి కొరకే కానీ యుద్ధం కోసం కాదు. అయితే, మోడీ ప్రభుత్వం మాత్రం దీనిని పట్టించుకోకుండా, కగార్ యుద్ధాన్ని కొనసాగిస్తోంది. నరరూప రాక్షసుడిగా, రక్తపిపాసిగా నరమేధాన్ని కొనసాగిస్తోంది. శాంతి చర్చలను వ్యతిరేకించడం, ప్రజాస్వామిక శాంతియుత వాతావరణానికి కృషిచేయకపోవటం రాజ్యాంగానికి వ్యతిరేకం అని కామ్రేడ్ సుభాషన్న పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఖరి వీరి శాంతి జపంలోని డొల్లతనాన్ని తెలియచేస్తోంది. సాయుధులతో శాంతి చర్చలు జరిపి, ఒప్పందాలు చేసుకున్న ఉదంతాలూ, సమస్య పరిష్కారానికి తోడ్పడిన సందర్భాలు - ఈశాన్య భారతంలోనే కాక, కాశ్మీరులో కూడా వున్నాయి. కనుక, ఆయుధాలు శాంతి చర్చలకు ఆటంకం అనేది సరైంది కాదు. శాంతి చర్చలకు షరతుగా ఆయుధాలు దించడం, లొంగిపోవడం, జన జీవన స్రవంతిలో కలిసిపోవడం లాంటి షరతులు సరైనవి కావు. సమస్య పరిష్కారానికీ, శాంతికీ తోడ్పడవు. అయితే, ఈ సమస్యలను కూడా శాంతి చర్చల ఎజెండాలో పెట్టి చర్చించవచ్చు. దీనికి ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన అవసరం లేదనీ కామ్రేడ్ నేతాజీ రాజన్న పేర్కొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కామ్రేడ్ జే కే ఆర్ గారి జేయస్సార్ డిమాండ్లు
1. సాయుధ చర్యలు లేకుండా చేయటానికి సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ నిర్ణయానికి ప్రతిస్పందనగా ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలి.
2. ప్రభుత్వం సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీతో బేషరతుగా శాంతి చర్చలు వెంటనే మొదలు పెట్టాలి.
3. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపివేయాలి. సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసులను నిర్మూలించే హత్యాకాండను ఆపాలి.
ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలకు సంబంధించి ఆదివాసులతో సహా, అనేక సమస్యలు వున్నాయి. అయితే, పై డిమాండ్లను వెంటనే చేయాల్సిన అవసరం వుంది. తక్షణమే కాల్పుల విరమణ, బేషరుతుగా శాంతి చర్చలు డిమాండ్ చేయటానికి అన్ని ప్రజాస్వామిక సంస్థలు, వ్యక్తులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యం కావాలి.
ప్రభుత్వం రాజ్యాంగబద్దమైన, చట్టబద్దమైన నిబంధనలు అనుసరించేటట్లుగా చేయుటలో వివిధ తరగతులు, శక్తులు భాగస్వాములయ్యే విశాల ఉద్యమం ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది. నక్సలైట్లను భౌతికంగా నిర్మూలించే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని వ్యతిరేకించే పాలకవర్గ పార్టీలు కూడా కాల్పుల విరమణ, బేషరతు చర్చలను డిమాండ్ చేయటానికి ముందుకు రావాలి. శాంతి చర్చలు, చుట్టివేతతో సహా, ప్రస్తుత ప్రతిష్టంభనకు శాంతియుత పరిష్కారం కొరకు తమ వాణిని వినిపించవలసిందిగా ప్రజాస్వామిక, శాంతి, సామాజిక న్యాయం కోరే శక్తులన్నింటికీ విజ్ఞప్తి చేస్తున్నారు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి, త్రినేత్రుడు, ఋషి, దేవాన్ష్, బోరన్న, జే కే ఆర్, జైశ్రీరామ్, సుభాష్ చంద్రబోస్, నేతాజీ రాజన్న, మరియు జి ఎస్ ఆర్. ఫోన్ నెంబర్ 8328277285.