తీవ్రమైన ఎండల్లో ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీలకు ఓరల్ రీహైడ్రాషన్ సాల్ట్స్ అందించిన ఫిల్డ్ ఆఫిసర్ సురోజు జమున.
ఎండ వడదెబ్బ తట్టుకునే తివిత్ర కోసం ఉపాధి కూలీలకు ఓ ఆర్ యస్ పాకెట్స్ పంపిణి చేసిన ఫీల్డ్ ఆఫీసర్ సురోజు జమున.
చెరువు ఆవరణలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పథకం.
యాదాద్రి జిల్లా సుద్దాల గ్రామంలో పంటపొలాలలో ఉన్న ఉపాధి హామీ కూలీలకు ఎండవేడిమికి తట్టుకోనే విధంగా ORS పాకెట్స్ కావలిసిన వారికి ఇచ్చి ఒక లీటర్ నీటిలో ఒక ORS పాకెట్ ని కలిపి ఆ నీటిని గంటకూ ఒక గ్లాస్ త్రాగాలి అని పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా ఫీల్డ్ ఆఫీసర్ జమున మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండాకాలంలో నిరుపేదలకు ఉపాధి హామీ గొప్పవరం అని ఉపాధి వర్కర్స్ ఆరోగ్యంగా ఉండడేమే అంటూ ఎండ తీవ్రత నుండి కాపాడేందుకు ఉపాధి హామీ కూలీలు వడదెబ్బకు గురి కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ కాసం శోభ, సరబోజు రమ, దొంతి వెంకటేష్, గూడ రేవతి, ఫీల్డ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.