హనుమాన్ చాలీసా పారాయణం శనివార ప్రత్యేక పూజలు

శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం శనివార ప్రత్యేక పూజలు



యాదాద్రి భువనగిరి జిల్లా సుద్దాల గ్రామం శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో భక్తులు కొత్తపెళ్లి కృష్ణ ఆలయ పూర్వ చైర్మన్ ఏల లింగయ్య హనుమాన్ భక్తుడు కొత్తపల్లి కృష్ణమూర్తి మరియు ఆలయ అర్చకులు వెంకటేశ్వర చార్యుల ఆధ్వర్యంలో హనుమాన్ మాలాదారుల సమక్షంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఆనందదాయకంగా జరిగింది.



 శనివారం సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొన్న హనుమాన్ భక్తులు ఈ సందర్భంగా హనుమాన్ భక్తులు మాట్లాడుతూ హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా అనేక రకాల భూతపిశాచ భయాందోళనలు తెలుపుతాయని అద్భుతమైన ఫలితాలు పొందుతారని నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా కోరుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితాయని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు శనివారం రోజు జరిగే హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో గ్రామ ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని స్వామివారి కృపాకటాక్షాలు పొంది ఆయురారోగ్యాలతో జీవనం కొనసాగించాలని కోరుకున్నారు అదేవిధంగా ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆలయ అభివృద్ధికి భక్తులందరూ ఏకతాటిపై ఉంటూ ఆర్థిక సహాయం అందజేస్తూ ఆలయ అభివృద్ధికి పాటుపడాలని సనాతన ధర్మ ప్రచారానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని పేర్కొన్నారు.