50ఏళ్ళ ఎమర్జెన్సీని తలపించే నేటి మోడీ పాలన. సెమినార్‌లో వక్తలు ఉద్ఘాటన



1975 జూన్‌ 25 నాటికి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెనీకి సరిగ్గా 50ఏళ్ళు పూర్తయ్యాయి. నాటి ఎమర్జెనీని తలపించే విధంగా నేడు మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర బిజెపి ప్రభుత్వ పాలన ఉందని సిపిఐ(ఎం) సీనియర్‌ నాయకులు సిహెచ్‌ నర్సింగరావు, కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాధం ఉద్ఘాటించారు. 



50ఏళ్ళ ఎమర్జెన్సీ ` నేటి నయా ఫాసిస్టు ప్రభావం అంశంపై డాబాగార్డెన్స్‌లో ఉన్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సిపిఐఎం విశాఖ జిల్లా కమిటీ సెమినార్‌ నిర్వహించింది. పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.గంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌లో నర్సింగరావు, లోకనాధం పాల్గొని మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య చరిత్రలోని 1975 జూన్‌ 25 చీకటి అధ్యాయమన్నారు. 1960లో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాల కూటములు విజయాలు సాధించి కాంగ్రెస్‌ పార్టీ గుత్తాధిపత్యానికి ఎదురుదెబ్బతగిలిందన్నారు. 

ఇందుకు ప్రతిస్పందనగా ఇందిరా గాంధీ ప్రగతిశీలంగా ధ్వనించే బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నినాదాల పరంపరతో తన స్థానాన్ని పున:స్థాపించుకున్నారన్నారు. నిరుద్యోగం, అసమానతలు భారీగా పెరగడం, ఎన్నికల్లో రిగ్గింగుకు పాల్పడటంతో ప్రజల తిరుగుబాటును ఎదుర్కొనలేక ఎమర్జెన్సీని విధింఛి రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టడం, పత్రికలపై సెన్సార్‌ విధిండం, పాత్రికేయులు, ప్రధానంగా సిపిఎం నాయకులను, కార్యకర్తలను జైళ్లపాలుజేయడం వంటి చర్యలకు పాల్పడిరదన్నారు. నాడు సిపిఐఎం నాయకులను, విద్యార్ధి, కార్మిక సంఘాల నాయకులను అరెస్టులు చేసి ఏళ్ళ తరబడి జైళ్ళలో పెట్టడాన్ని గుర్తుచేసారు. విశాఖపట్నంలో నర్సింగరావు విద్యార్ధి ఉద్యమ నాయకుడుగా ఉంటూ ఎమర్జెన్సీ కాలాన్ని ఎలా ఎదుర్కొన్నారో ఆయన అనుభవాలను క్లుప్తంగా వివరించారు. హిందూస్థాన్‌ షిప్‌యార్డు, ఆంధ్రాయూనివర్శిటీల్లో కార్మికుల ఎమర్జెన్సీని ఎదుర్కొని పోరాటాలు ముందుకు సాగాయన్నారు. ఎమర్జెన్సీ కంటే నేడు మోడీ పరిపాలన అత్యంత కూరత్వంగా ఉందన్నారు. రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ద్వంసం చేయడంతో పాటు కార్మికవ హక్కులను కాలరాయటానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు. నేడు హిందూత్వ కార్పొరేట్‌ కలయకతో దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతుందన్నారు. ‘ఉపా’చట్టాన్ని ఉపయోగించి ఈ 11ఏళ్ళలో బిజెపి ప్రభుత్వం వామపక్ష వాదులను జైళ్ళలో నిర్భంధిస్తోందన్నారు. అర్భన్‌ నక్సలైట్లగా చిత్రీకరించడం, ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టులను హతమార్చడం వంటి చర్యలు పెరిగాయన్నారు. మరోవైపు ఎమర్జెనీ కాలంవలె మీడియా హక్కులపై దాడిచేస్తుందన్నారు. కార్మికులకు ఉన్న చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చి కార్మికుల ఐక్యతకు భంగం కలిగించడంతో పాటు రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చిందన్నారు. కేంద్ర బిజెపి, బిజెపికి సహకరిస్తున్న పార్టీలను ఒంటిరి పాటు చేయడంతో పాటు అవి అనుసరిస్తున్న విధానాల ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలను సిద్దం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు పాల్గొన్న ఈ సెమినార్‌లో సిపిఐఎం సీనియర్‌ నాయకులు ఎస్‌.సుధాకర్‌, రాధాకృష్ణ, కె.ఎం.కుమార్‌ మంగళం పాల్గొని తమ అనుభవాలను వివరించారు.