గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి

ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి. 



తేదీ: 25-06-2025న ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల వద్ద వీఆర్ఏల సమస్యల పరిష్కారం కై రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ ధర్నా జరిగింది. 



ఈ ధర్నా ను ఉద్దేశించి విశాఖ జిల్లా వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షులు పి వెంకట్రావు మాట్లాడారు. రాష్ట్రంలోని 19300 వీఆర్ఏలు సమస్యల వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినట్లు ఏపీలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరో ప్రక్క పార్ట్ టైం పేరుతో ఫుల్ టైం ఉద్యోగం చేయించుకుంటూ అక్రమంగా నైట్ వాచ్ మెన్ డ్యూటీలు వేస్తున్నారని తక్షణం వాటిని రద్దు చేయాలని కోరారు. అర్హులైన గ్రామ రెవెన్యూ సహాయకులకు విఆర్ఓ, అటెండర్ ప్రమోషన్లు ఇవ్వాలని జిల్లాలోని అర్హులతో సీనియార్టీ లిస్టు పెట్టాలని కోరారు. నామిని గ్రామ రెవిన్యూ సహాయకులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 



ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ ఆఫీసులో జిల్లా రెవెన్యూ అధికారి వారికి (డిఆర్ఓ) వినతి పత్రం ఇచ్చి గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరడం జరిగింది. అటెండర్, నైట్ వాచ్మెన్ ప్రమోషన్లు 20 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతం పెంచాలని కోరారు. 



ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు అలమండ సత్యం, పద్మనాభ మండలం కార్యదర్శి లింగాల సింహాచలం, ఆనందపురం మండలం నాయకులు అప్పలరాజు, చిన్నారావు, పెందుర్తి మండలం ఎల్లారావు, పెదగంట్యాడ మండలం పి. పైడమ్మ సుమారు 40 మంది వీఆర్ఏలు పాల్గొన్నారు. ఇట్లు. పి.వెంకటరావు. (గౌరవ అధ్యక్షులు). ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం. విశాఖ జిల్లా కమిటీ.