వాలీబాల్ కోర్ట్ నిర్మించిన టిడిపి నాయకుడు

సొంత నిధులతో వాలీబాల్ కోర్ట్ నిర్మించిన టిడిపి నాయకుడు ఆవులు వాసు..



శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో విడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీ గ్రామంలోని మంగళవారం రోజు వాలీబాల్ కోర్ట్   ఓపెనింగ్ కు ముఖ్య అతిథులుగా ఆవులు వాసు  పాల్గొన్నారు. 



ఈ సందర్భంగా ఆవులు వాసు మాట్లాడుతూ ప్రతి యువత క్రీడలు పట్ల ఉత్సాహంగా ఉండి ముందుకు సాగాలన్నారు, ఇలాంటి వారి కోసం తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. రానున్న రోజుల్లో ఆరోగ్యంలో ఒక భాగమైన క్రీడలు తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో  గ్రామ పెద్దలు యువత అధిక సంఖ్యలో పాల్గొని వాలీబాల్ ఆడారు.