మెడికల్ ఖర్చులకు రూ.10,000 వాసుపల్లి ఆర్థిక సాయం..
దక్షిణ నియోజకవర్గ ఆపద్బాంధవుడు, నిర్విరామ ప్రజా సేవకులు మాజీ ఎమ్మెల్యే , వైయస్సార్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఓ పేద కుటుంబానికి రూ.10, 000 ఆర్థిక సాయం చేసి చేయూత అందించారు. 35 వార్డుకు చెందిన లండ త్రినాథ్ (58) అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యారు. స్థానిక నేతలు ద్వారా విషయం తెలుసుకున్న వాసుపల్లి ఇంటికి వెళ్లి పరామర్శించి సొంత నిధులతో ఆర్థిక సహాయం అందజేసి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, మదర్ తెరిసా సేవా దృక్పథం, మహనీయుల అడుగుజాడల్లో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలకు కష్టాలలో అండగా ఉండడమే లక్ష్యంగా తన కష్టార్జీతంలో కొంత భాగాన్ని పేదలకు సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేకంగా కేటాయిస్తున్నానన్నారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తారని, వైయస్సార్సీపి ప్రభుత్వంలో తన సంకల్పానికి మరింత బలం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పకుండా రానున్న వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలందరికీ న్యాయం చేస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అనుబంధ సంఘాల అధ్యక్షులు సీనియర్ నాయకులు ఎస్సీ సెల్ అధ్యక్షుడు లండా సుధా, రమణమ్మ, గొరుసు నాగిరెడ్డి, వినోద్, బప్పి, పి. చిన్ని, రాంబాబు, రమ్య, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.