గాజువాకలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం నిర్వహించిన ఉచ్చు చర్యలో అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ (ASO) కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. పది వేలరూపాయులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఏసీబీ అధికారులు విచారణలో భాగంగా పరిశీలిస్తున్నారు.
ఆరు నెలల క్రితం రేషన్ బియ్యంతో పట్టుబడిన రెండు ఆటోలని పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు.
పట్టుబడిన ఆటోలను విడుదల చేయమని హైకోర్టు ఆదేశాలు అనుసరంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా భాధితుల పక్షాన ఆటోలు విడుదలకి సర్కిల్ -3 ఏ.ఎస్.వో కృష్ణకి ఆదేశాలు జారీ చేశారు. అయిన రెండు ఆటోలు విడుదలకి నెల రోజులగా ఏ. ఎస్. వో కృష్ణ చుట్టు తిరిగితున్న బాధితులు, ఆటోలు విడుదలకి 10 వేలు డిమాండ్ చేసిన ఏ. ఎస్. వో కృష్ణ. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితులు ఏసీబీ అధికారులకి ఫిర్యాదు చేసారు. ఈరోజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డ ఏ. ఎస్. వో కృష్ణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ డిఎస్పీ రమణ మూర్తి....
