అవాస్తవ, నిరాధార, దుష్ప్రచారం సోషల్ మీడియాలో విస్తరిస్తోంది.

బుట్టా రేణుక గారిపై ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలకు  ఖండించిన  నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు డి. నజీర్ అహమ్మద్. 



ఈరోజు సాయంత్రం, సుమారు అరగంట క్రితం నుండి “వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బుట్టా రేణుక  మందలించింది”. అనే అవాస్తవ, నిరాధార, దుష్ప్రచారం సోషల్ మీడియాలో విస్తరిస్తోంది. 



ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. శ్రీమతి బుట్టా రేణుక అధిష్టానం నుండి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు,ఏ విధమైన మందలింపులు జరగలేదు. ఇలాంటి పుకార్లను నమ్మకండి. నిజాలు తెలిసిన వారెవరూ ఈ అబద్ధాలకు లోను కావొద్దు. ప్రజలలో గందరగోళం సృష్టించేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఈ ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

డి. నజీర్ అహ్మద్

నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మిగనూరు