హిందూపురంలో షేక్ షబ్బీర్‌కు ఉత్తమ రక్తదాత పురస్కారం | World Blood Donor Day | B2B NEWS

హిందూపురంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా నిర్వహణ...

ఉత్తమ రక్తదాత పురస్కారం అందుకున్న షేక్ షబ్బీర్...

ప్రాణదాతకు గౌరవం.. షేక్ షబ్బీర్‌కు ఉత్తమ రక్తదాత అవార్డు... రక్తదాన సేవలకు గుర్తింపు.. షేక్ షబ్బీర్ సత్కారం... ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఉత్తమ రక్తదాత పురస్కారం... రక్తదాతలే నిజమైన ప్రాణదాతలు : ఉమర్ ఫారూఖ్ ఖాన్... 



హిందూపురంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం... షేక్ షబ్బీర్‌కు ఉత్తమ రక్తదాత అవార్డు... రక్తదాతలకు ఘన సన్మానం... ప్రాణదాతలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి.. బ్లడ్ బ్యాంకు ఆధునీకరణపై ప్రశంసలు... రక్తదానం మహాదానం... హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వేడుకలు..



🩸 హిందూపురంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా నిర్వహణ...

🩸 షేక్ షబ్బీర్‌కు ఉత్తమ రక్తదాత పురస్కారం...

🩸 రక్తదాతలే సమాజానికి ప్రాణదాతలు : ఉమర్ ఫారూఖ్ ఖాన్...

🩸 రక్తదాతలకు ఉచిత బీమా కల్పించాలని విజ్ఞప్తి...

🩸 బ్లడ్ బ్యాంకు ఆధునీకరణకు ఎమ్మెల్యే బాలకృష్ణకు కృతజ్ఞతలు...

🩸 వైద్యులు, సామాజిక సేవకులు, రక్తదాతలు పాల్గొన్నారు...



హిందూపురం బ్లడ్ బ్యాంకులో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవ వేడుకలు..



హిందూపురం, జూన్ 14: హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంతరం రక్తదానం చేస్తూ సమాజ సేవలో ముందుండే రక్తదాతలను సన్మానించి ఉత్తమ రక్తదాత పురస్కారాలను అందజేశారు. అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ షబ్బీర్ కు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ, ఆర్‌ఎంఓ డాక్టర్ ప్రసాద్, రక్తనిధి ఇన్‌చార్జ్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ రక్తదాత పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ రక్తదాతలు సమాజానికి ప్రాణదాతలని కొనియాడారు. హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ చొరవతో కోటి రూపాయల నిధులతో బ్లడ్ బ్యాంకును అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాతలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని, ప్రతి సంవత్సరం ఉత్తమ రక్తదాతలను కలెక్టర్, మంత్రులు, గవర్నర్ స్థాయిలో సత్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సామాజిక సేవకులు, రక్తదాతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.