దుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి



విజయవాడ, ఆగస్టు 27: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై. నైరుతి రెడ్డి, ఆదోని నియోజకవర్గ యువనేత జయమనోజ్ రెడ్డి కూడా ఆయనతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.



వేకువజామున ఆలయానికి చేరుకున్న నాయకులకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో శాంతి, సుభిక్షాలు నెలకొనాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రార్థించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.