బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్

అల్లూరి జిల్లా, ఘాట్ రోడ్ లో బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్



అల్లూరి జిల్లా, గూడెం కొత్తవిధి మండలం, దారాలమ్మా తల్లి ఘాట్ రోడ్ సప్పర్ల రేయిన్ గేజ్ వద్ద శనివారం ఓ ఆయిల్ ట్యాంకర్ బ్రేకుల్ ఫేయిల్ అయ్యి అదుపుతప్పి లోయలో పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యయి. విశాఖపట్నం నుండి సీలేరు పెట్రోల్ బంకుకు ఆయిల్ తీసుకొచ్చిన ట్యాంకర్ తిరిగి బయలు దేరింది. ఈ క్రమంలో మలుపు వద్ద ఒక్కసారిగా బ్రేకులు పెయిల్ అయి 100అడుగుల లోయలోకి ట్యాంకర్ జారి పడిపోయింది.