ఆధార్ కార్డు, పాన్ కార్డులు ఇవ్వవద్దు

సర్వే నేపథ్యంలో ఇంటికి వస్తే ఆధార్ కార్డు, పాన్ కార్డులు ఇవ్వవద్దు గుండాల మండల ఏస్ ఐ సైదులు. సర్వే కార్యక్రమం సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.



తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింట కుటుంబ సర్వే అనే కార్యక్రమం పటిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు, ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్ బుక్ అడిగితే ఇవ్వద్దని, ఫోన్ నంబర్,ఓటీపీ చెప్పవద్దని గుండాల మండల ప్రజలకు ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా వాటికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.ఇలాంటి వారు ఎవరైనా ఇంటి వద్దకు వస్తే 100కు ఫిర్యాదు చెయ్యాలని గుండాల మండల ఏస్ ఐ సైదులు సూచించారు.