దమ్మపేట మండలం లో భూ కబ్జా, ఆక్రమణ గురి అయ్యిన ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించి సమగ్రమైన సర్వే నిర్వహించాలి... తంబల్లా రవి అశ్వారావుపేట నియోజికా వర్గ ఆదివాసీ నాయకులు...
ఏజెన్సీ ప్రాంతాలు లో ఉన్నా ప్రభుత్వ ,అసైన్డ్ భూములను గుర్తించి, భూమిలేని పేద ప్రజలకు పoచాలి...వాడే వీరాస్వామి అశ్వారావుపేట నియోజకవర్గ నియోజికా వర్గ ఆదివాసీ నాయకులు
వివాదస్పధమైన భూములు సర్వే 1458,114,586/1,84/1,506/1,306, లో వెంటనే సర్వే చేసి తద్వారా పేద వారికి అప్పగించాలి. అని జిల్లా సబ్ కలెక్టర్ కి, దమ్మపేట మండల MRO నరేష్ కి వినతిపత్రం అందజేసిన ఆదివాసీ నాయకులు...
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం తాసిల్దారు కార్యాలయం ముందు అశ్వారావుపేట నియోజకవర్గం ఆదివాసీ నాయకులు తంబల్లా రవి గారు ప్రభుత్వ భూములు సర్వే చేసి పేద ప్రజలకు పoచాలి అని ఒక్కరోజు రీలే నిరాహారదీక్ష కి హాజరు అయ్యి తంబల్లా రవి గారికి పూలమాల వేసి సంఘీభావం ప్రకటించి,మద్దతు తెలియజేసిన అశ్వారావుపేట నియోజకవర్గ యువ రాజకీయ నాయకులు వాడే వీరాస్వామి. ఈ సందర్భంగా వారు అశ్వారావుపేట నియోజికా వర్గ యువ రాజకీయ నాయకులు వాడే. వీరాస్వామి మాట్లాడుతూ దమ్మపేట మండలం లో సర్వే నెం 1458/1, 114,306,586/1,881/1,506/1, కొన్ని వేల ఎకరాలు భూమి అక్రమణకు గురి కాగ కొన్ని వందలు ఎకరాలు కబ్జాకి గురి కావడం జరిగింది. ధిని వల్ల అమాయకపు ఆదివాసీలు,దళితులు కావచ్చు తీవ్రమగ నష్టం పోయారు. అని ,కొన్ని సంవత్సరాలు నుండి ఈ సమస్య పెరుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పాడిన తదుపరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కి దృష్టికి తీసుకొని పోవటం జరిగింది అని అంధరు సానుకులం గా స్పందించిన దమ్మపేట మండలం లో కొందరు రాజకీయ నాయకులు అధికార ప్రభల్యం తో సర్వే జరగకుండ అడ్డూ పడుతున్నారు అని అన్నారు. వెంటనే MRO సర్వే చేసి అక్రమణకు, కబ్జాలకు గురి అయ్యిన గుర్తించి సమగ్ర సర్వే చేయించాలి అని, సబ్ కలెక్టర్ కి MRO నరేష్ కి వినతిపత్రం అందించారు.
ఈ కార్యక్రమం లో ఆదివాసీ JAC నాయకులు బండారు సూర్యనారాయణ, ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షులు కoటే కేశవ్ గౌడ్, MRPS నాయకులు కొలిగపోగు కాంతారావు కారం నాగేంద్రబాబు, కోర్సా నాగేంద్రబాబు,యట్ల శివకుమార్ పోతురాజు, తా మా ఆదినారాయణ, అప్పిరెడ్డి. వెంకన్నబాబు, రాంబాబు, కోర్సా. శ్రవణ్, తధితరులు పాల్గొన్నారు.