అమలాపురం మార్చి 23: బాలికల భవిష్యత్తును కాపాడే మైలురాయిగా బాల్యవివాహాలు నిరోధక చట్టం నిలిచేలా సిబ్బంది ప్రజలు పూర్తి సమన్వయం వహించాలని డాక్టర్ బి.ఆర్ కోనసీమ జిల్లా జయింట్ కలెక్టర్ టీ. నిశాంతి అన్నారు
జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నవంబర్ 17, 2025 న బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 పై జిల్లా వ్యాప్తంగా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు సమావేశము నందు మండల మండల స్థాయి లో తాహసిల్దార్లు, ఎంపీడీ వో, ఎంఈఓ, సిఎంపిఓ లు మరియు గ్రామస్థాయి బాల్యవివాహ నిరోధక అధికారులు మహిళా పోలీసు, వీఆర్వోలు,పంచాయతీ సెక్రెటరీ, గ్రామ సర్పంచ్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ఏఎన్ఎం లకు బాల్యవాహలపై అవగాహన కల్పించి బాల్య వివాహాల ఏ ప్రాంతాలలో ఎక్కువగా బాల్యవివాహాలు నమోదు అవుతున్నాయో ఆ గ్రామాలలో సిఎంపీఓ లు చురుకుగా పనిచేయాలని బాల్యవివాహాల వ్యవస్థను సమూలంగా రూపుమాపాలని ప్రజలలో చట్టంపై అవగాహన కల్పించి, చైతన్యం తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో జాయింట్ కలెక్టర్ గ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. మారుమూల గ్రామీణ గ్రామాలలో ఉన్న ప్రజలకు సాంస్కృతిక కార్యక్రమాలైన బుర్రకథలు హరికథల ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించి బాల్య వివాహాల నిర్మూలన వ్యవస్థను రూపుమాపాలని సూచించారు.
ఈ సందర్భంగా 2022 నుండి 2025 వరకు జిల్లా వ్యాప్తం గా 65 బాల్యవాహాలు నిర్మూలించడం జరిగిందని జిల్లా నందు బాల్య వివాహాలు విరోధక చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం వలన 2025 నవంబర్ నుండి 23 మర్చి 2026 వరకు 4 బాల్యవివాహాలు మాత్రమే నమోదు కావడం జరిగిందని వాటిని కూడా నిలిపివేయడం జరిగిందనీ తెలియజేస్తూ జిల్లా స్థాయి సమావేశం ద్వారా ప్రతి ఒక్కరు బాల్య వివాహాలపై అవగాహన పెంపొందించామన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం, బాల్య వివాహాలను అరికట్టడానికి రూపొందించబడిన అత్యంత కీలక మైన చట్టం బాల్యవివాహాల నిరోధక చట్టమని తెలిపారు. చట్టం అమలు తీరు, ఎదురవుతున్న సవాళ్లు మరియు ప్రస్తుత పరిస్థితులు బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ద్వారా బాల్యవివాహాల రహిత కోనసీమ జిల్లాగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ చట్టం ప్రకారం వివాహ వయస్సు పురుషులకు 21 ఏళ్లు, స్త్రీలకు 18 ఏళ్లు గా నిర్ణయించబడిందన్నారు. అంతకంటే తక్కువ వయస్సులో వివాహం చేయడం నేరంగా పరిగణించాలన్నారు. బాల్య వివాహం జరిపించినా, ప్రోత్సహించినా లేదా ఆ వివాహ వేడుకలో పాల్గొన్నా నేరమని శిక్షలు జరిమాణాలు జరిమానా విధించవచ్చునన్నారు.
ప్రస్తుత గణాంకాలు గడిచిన దశాబ్ద కాలంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఈ ఆచారం ఉందన్నారు. అమలులో ఎదురవుతున్న సవాళ్లు, పేదరికం, భద్రత లేకపో వడం పురాతన ఆచారాల వల్ల గ్రామాల్లో ఇంకా రహ స్యంగా వివాహాలు జరు గుతున్నాయన్నారు చట్టం గురించి దాని వల్ల కలిగే చట్టపరమైన పర్యవసా నాల గురించి గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన పెరగాలన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం అమలులో పురోగతి ఉన్నప్పటికీ, చట్టంతో పాటు సామాజిక మార్పు కూడా అత్యంత అవసరం అన్నారు. విద్య, ఆర్థిక స్వావలంబన కఠినమైన నిఘా ద్వారా మాత్రమే ఈ దురాచారాన్ని పూర్తిస్థాయిలో రూపుమాపాలన్నారు.

