జాబ్ క్యాలెండర్ తో యువతకు అండగా కూటమి ప్రభుత్వం...
జాబ్ క్యాలెండర్ తో నిరుద్యోగులకు భరోసా....కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...
యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్ర లో నారా లోకేష్ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదలకు కృషి చేసి యువతకు పెద్దన్న ల వ్యవహించారని ఎమ్మెల్యే ప్రశాంశించారు. ఉగాది సందర్భంగా ప్రభుత్వం 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా విద్య, పోలీస్ శాఖలకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 20 నెలల్లోనే 6,28,347 ప్రైవేటు ఉద్యోగాలను యువతకు అందించడం జరిగిందన్నారు. వీటితో పాటు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించి భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేసిందని, నేడు మరోసారి డీఎస్సీని, జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం 3,000 ఖాళీలను కేటాయించిందని, ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,500 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తుందన్నారు. పరిపాలనా విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల కోసం దాదాపు 600 పోస్టులతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం 1,000 పోలీస్ కానిస్టేబుల్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కాబోతున్నాయన్నారు. జాబ్ క్యాలెండర్ తో నిరుద్యోగులకు భరోసా లభిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్ రెడ్డి నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేసి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోగా కమీషన్ల కోసం ఉన్న కంపెనీలను తరిమేసి 34 లక్షల మంది యువత భవిష్యత్ ను నాశనం చేశారన్నారు. జగన్ పాలనలో యువత ఉద్యోగాలు, ఉపాధి లేక వేలాదిమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్లలో 24 శాతం నిరుద్యోగంతో అప్పట్లో దేశంలోనే ఏపీ ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా నిరుద్యోగుల పట్ల, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను తెలుపుతుందన్నారు.
