ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సూచనల మేరకు, సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ... దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహనీయుల త్యాగాలు అమరమైనవని కొనియాడారు.
వారి ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రగతి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం నాయకులు, కార్యకర్తలు మువ్వన్నెల జెండాకు సెల్యూట్ చేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

