శ్రావణ మాస ఉత్సవాలకు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులకు ప్రత్యేక ఆహ్వానం
ఊరుకుంద, ఆగస్టు 13: శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ ఈరణ్ణ స్వామి (ఊరుకుంద) దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రావణ మాస ఉత్సవాలు–2026 సందర్భంగా ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులు, ఆదోని జనసేన పార్టీ ఇన్‌చార్జి మల్లికార్జున నాయకర్ కు దేవస్థాన పాలక మండలి సభ్యులు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దేవస్థాన పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులు మాట్లాడుతూ, శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే శ్రీ స్వామివారి మహోత్సవం, పల్లకి ఉత్సవం, ప్రత్యేక పూజలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ ఈరణ్ణ స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు. శ్రావణ మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థాన ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి సభ్యులు ఎస్. చిన్న రంగస్వామి తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

