విశాఖపట్నం: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నం జిల్లా పరిపాలనా యంత్రాంగం ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల శకటాల (Tableaux) ప్రదర్శనలో వైద్య ఆరోగ్య శాఖ శకటం ప్రథమ బహుమతి సాధించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీ అనగాని సత్య ప్రసాద్ మరియు విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ ఎన్. అన్బరసన్, IAS గార్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ పి. జగదీశ్వర్ రావు గారిని ప్రత్యేకంగా అభినందించారు.
ఉత్తమ శకటం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన అధికారులను డాక్టర్ పి. జగదీశ్వర్ రావు గారు ప్రశంసించారు. డిస్ట్రిక్ట్ ఎక్స్‌టెన్షన్ మీడియా ఆఫీసర్ (DEMO) శ్రీ బి. నాగేశ్వరరావు, డాక్టర్ కార్తీక్, శ్రీ శశిభూషణ్‌లతో పాటు సహకరించిన సిబ్బంది కృషిని ఆయన కొనియాడారు.
ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు:
వైద్య ఆరోగ్య శాఖలో విశేష సేవలందించిన వివిధ కేడర్ల ఉద్యోగులకు ఈ క్రింది విధంగా ప్రశంసా పత్రాలు అందాయి:
జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా: 13 మంది అధికారులకు/సిబ్బందికి
DM&HO చేతుల మీదుగా: 25 మంది సిబ్బందికి
వైద్య సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి సత్కారాలు పొందిన అధికారులు, సిబ్బంది అందరికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి,
విశాఖపట్నం.


