జీకేవీధి: జీకేవీధి మండలం ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సెట్టి నాగేష్కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ‘ఎయిర్ కండీషనర్’ (AC) గుర్తును కేటాయించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా సెట్టి నాగేష్ మాట్లాడుతూ... గ్రామ సమగ్రాభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా తాను ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు స్థానిక ప్రజలు, వివిధ వర్గాల నుంచి విశేష మద్దతు లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ‘ఎయిర్ కండీషనర్’ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.


