సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ లక్ష్యసాధనకు కృషి చేయాలి

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ లక్ష్యసాధనకు కృషి చేయాలి: వి.సి.సి కోఆర్డినేటర్ సతీష్ రెడ్డి



జగదాంబ, నవంబర్ 20: నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వి.పి.ఆర్. నగర్‌లో వి.సి.సి (VCC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సి.ఎల్.సి (CLC) సెంటర్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.



కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వి.సి.సి కోఆర్డినేటర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి కాలంలో ఎక్కువ మంది పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఫోన్లకు దూరంగా ఉంటూ, చదువుపై దృష్టి సారించి తమ లక్ష్యసాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, వి.సి.సి ఆధ్వర్యంలో నగరంలోని పలు కాలనీలలో ఉన్న క్లబ్బులలో కూడా క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ వేడుకల్లో సెంటర్ నిర్వాహకులు సరోజినీ దేవి, ఉమ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.