ఆదోని: ఆదోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ కె. మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, పట్టణంలోని 20, 21 వార్డుల పరిధిలో చేపట్టనున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులకు మంగళవారం భూమి పూజ నిర్వహించారు. ఇందిరా నగర్లోని ఎరుకల కాలనీ నుండి క్రిస్టియన్ స్మశాన వాటిక వరకు సుమారు రూ. 22.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న 2 అడుగుల కాలువ పనులను 20వ వార్డు కౌన్సిలర్ బన్నూరు మీనాక్షి, 21వ వార్డు కౌన్సిలర్ కొమ్ము రామలక్ష్మి చేతుల మీదుగా శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని టిడిపి సీనియర్ నాయకులు శ్రీ భూపాల్ చౌదరి, యువ నాయకులు శ్రీ మారుతి నాయుడు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు, వార్డుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మరియు నియోజకవర్గ నాయకత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఐ.సి. రామకృష్ణ (అడ్వకేట్), రాజేష్, వలి, కృష్ణ, శాంతమూర్తి, సూరి, యు. రంగస్వామి, బడే హనుమంతు, గౌస్, బాలరాజు, శరభ, అంజి, నాగరాజు, నరసప్ప, హరి, రామాంజి, వై. మారెన్న, కిట్ట, సోము, వై. ఈరన్న తదితర నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



