కుటుంబ సమేతంగా ఓటు వేసిన సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి

 



మడకశిర (శ్రీ సత్యసాయి జిల్లా): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ పరిధిలోని గంగులవాయిపాళెం పంచాయతీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు ఆయన కుటుంబ సమేతంగా చేరుకున్నారు.



సాధారణ ఓటరులాగే పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్‌లో నిలబడి ఆయన, ఆయన కుటుంబ సభ్యులు తమ ఓటును వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

— బి టు బి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా బ్యూరో.