నేషన్ డెవలప్మెంట్ ఫ్రంట్ (NDF)లో చేరండి.. రాజ్యాంగ హక్కుల కోసం గళం విప్పండి!
బహుజనులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువతకు డాక్టర్ పోతుల నాగరాజు పిలుపు
ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల సాధన, సామాజిక న్యాయం లక్ష్యంగా నేషన్ డెవలప్మెంట్ ఫ్రంట్ (NDF) ముందుకు సాగుతోంది. ఈ ఉద్యమంలో బహుజనులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ వర్గాలు, నిరుద్యోగ యువత భాగస్వాములు కావాలని డాక్టర్ పోతుల నాగరాజు పిలుపునిచ్చారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకోవడంతో పాటు సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల సాధనకు, ప్రజల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేయాలని సూచించారు.
ప్రత్యేకించి విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత సామాజిక బాధ్యతతో ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజల హక్కుల కోసం పోరాడే వేదికగా NDFలో చేరాలని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ.. సామాజిక న్యాయం సాధన.. ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నేషన్ డెవలప్మెంట్ ఫ్రంట్లో భాగస్వాములు కావాలని డాక్టర్ పోతుల నాగరాజు పిలుపునిచ్చారు.



